.బిగ్ బాస్-2 ఈవారం ఎలిమినేషన్ ఎవరో తెలుసా ?

బిగ్ బాస్ బుల్లితెరని షేక్ చేస్తున్న రియాలిటీ షో. నాని హోస్టుగా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 నాలుగు వారలు కంప్లీట్ చేసుకున్నది. బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటుంది. శని, ఆదివారాలే కాదు వారం మొత్తం కూడా షోని నడిపిస్తున్న కంటెస్టంట్స్ రకరకాలుగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు.

 

ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికొస్తే , గణేష్ , భాను శ్రీ, దీప్తిలు నామినేషన్ లో ఉన్నారు. ఇక సామాన్యుడికోటలో ఇంట్లోకి వచ్చిన గణేష్ స్టాంగ్ గా కనిపిస్తున్నాడు. ఇక మంచి వారు, చెడ్డ వారు టాస్క్ లో కౌశల్ భాను శ్రీతో మిస్ బిహేవ్ చేశాడన్న విధంగా భానుశ్రీ కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరచాయి. దీనితో అందరి చూపులు ఈ సారి భాను పై పడ్డాయి.

 

ఇక దీప్తి విషయానికొస్తే ఆమె ఇంట్లో ఉండే పద్దతి బట్టి దీప్తి ఇప్పుడే ఇంటి నుండి వెళ్లే ఛాన్స్ లేదు. సో ఈ వారం ఎలిమినేషన్ లో భాను ఇంటి నుండి వెళ్తోంది అని సమాచారం. కానీ ఇక్కడే బిగ్ బాస్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ లో భాగం గా ఎలిమినేషన్ని ఈ వారం తీచేయొచ్చు అని తెలుస్తుంది.

 

ఈ వారం ఎలిమినేషన్ జరిగిన పద్దతి వేరు, ప్రతివారంలాగా కాకుండా ఈ వారం ఒకరి ఎలిమినేషన్ ఇంకొకరి చేతుల్లో పెట్టాడు. దీనిపై ఆలోచిస్తే ఒక విధంగా అసలు ఈ వారం ఎలిమినేషన్ అనేది ఉండకపోచ్చు అని అర్థమౌతుంది. బిగ్ బాస్…ఇక్కడ ఏమైనా జరగొచ్చు అనే టాగ్ లైన్ తో మొదలైన ఈ షో లో …..ఏమైనా జరగొచ్చు అది మనం ఊహించటం కష్టం…….

 

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ వారం వైల్డ్ కార్డు రూపం లో మరో హాట్ హీరోయిన్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *