తన తల్లికి ఎవరు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ ప్రదీప్

మన తెలుగు వెండి తెరపై వచ్చే యాంకర్ ప్రదీప్ అనగానే అమ్మాయిలు ఒక రేంజ్ లో ఎగపడతారు . ప్రదీప్ కు పిచ్చ క్రేజ్ ఉంది. తాను యాంకర్ గా చేసే ప్రతి షో హిట్ కావాల్సిందే. ప్రదీప్ అందరిని మాటలతోనే పడగొట్టేస్తాడు. అందరిని బాగా నవ్విస్తాడు, అభిమానిస్తాడు. ఇంత జాలీగా ఉండే ప్రదీప్ ఈ సంవత్సరం మొదట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో దొరికిపోయాడు. ఈ సంఘటనతో ప్రదీప్ ఫామిలీ లో కొన్ని సమస్యలు చోటు చేసుకున్నాయి. ఆ రోజు ప్రదీప్ పరువు కాస్త గంగ లో కలిసిపోయినంత పని జరిగింది. ఆ సమయం లో ప్రదీప్ కాస్త కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. తాను చేసింది తప్పని మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు.

ఈ రోజు Mothers Day కనుక వాళ్ళ అమ్మగారికి ఒక చిన్న గిఫ్ట్ తో పాటు జనవరి లో తను చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయనని మాట ఇచ్చాడట. వాళ్ళ అమ్మగారు ఆ మాట విని చాలా సంతోషించారట.

ఇలా వాళ్ళ ఫామిలీ లో చోటుచేసుకున్న సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తూ…అవి తన కెరీర్ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రదీప్ యాంకరింగ్ అంటే చిన్న,పెద్ద,అడ,మగ తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి నచ్చుతుంది. ఒక విధంగా చెప్పాలంటే యాంకర్ అనగానే సుమ ఎలా గుర్తుకు వస్తుందో అలానే ప్రదీప్ కూడా గుర్తుకువస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *