మోక్షజ్ఞ తో రకుల్ ప్రీతీ సింగ్ రొమాన్స్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే మేజర్ నటీ నటుల ఎంపిక పూర్తయిందని చెప్పొచ్చు. బసవతారకం పాత్ర కోసం విద్య బాలన్ ను ఎంపిక చేసినారు. అలాగే చంద్ర బాబు పాత్ర కోసం దాగ్గుబాటి రానా ను ఎంపిక చేసినారు. అయితే ఇప్పడూ ఎన్టీఆర్ బయో పిక్ లో ఒక పాల అమ్మాయి పాత్ర కోసం రకుల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ కుర్ర వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న లవ్ స్టోరీస్ నడిపినట్లు తెలుస్తుంది.

పాత్ర చిన్నదే అయినప్పటికీ ఉన్నంత సేపు చాలా ఫన్నీగా ఆ క్యారెక్టర్స్ ఉంటాయని యూనిట్ వర్గాల నుంచి లీకైంది. అంటే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ – రకుల్ ప్రీత్ మధ్య ఆ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. నిజానికి వాళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలానే ఉంటుంది. కానీ ఏదో మ్యాజిక్ లేనిదే ఆ పాత్రకు రకుల్ ఎంపిక చేసి ఉండడు క్రిష్‌. `కంచె` సినిమాలోనే అద్భుతమైన ఇమేజినేషన్ పాత్రలతో కథను నడిపించాడు. అలాంటింది జీవిత కథ కాబట్టి ఇంకా సహజంగా డిజైన్ చేసి ఉంటాడని తెలుస్తోంది. ఇంకా కథలో కొన్ని ముఖ్యమైన ఫీమేల్ పాత్రలు ఉండనున్నాయని సమాచారం. వాటి ఎంపిక త్వరలో జరుగుతుందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రస్తుతం క్రిష్ ఈ సినిమా పనుల్లోనే ఉన్నారు. ఇటీవలే తొలి రూపును విడుదల చేసారు. అన్ని వర్గాల వారి నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. నందమూరి అభిమానులకైతే బిగ్ ట్రీట్ లా నే అనిపించింది. దీంతో సినిమాపై అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. `మహానటి` తర్వాత మరో దిగ్గజ నటుడి కథ వెండి తెరపై ఆవిష్కృతం కావడంతో పెద్ద సంచలనానికి తెరలేపనుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *