పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన స్టార్ హిరోయిన్

హాట్ అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను నిద్ర లేకుండా చేసిన నేహా దుపియా. పెద్ద షాకే ఇచ్చింది. ఎలాంటి ప్రకటన చేయకుండా పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్య పరిచింది. పెళ్లి పూర్తయిన తర్వాత ఆ ఫోటోలను షేర్ చేస్తూ నాకు పెళ్లి అయిపోయిందని తెలిపింది. నటుడు అంగద్ బేడీని నేహా పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలో తెలియజేసారు.

“Best decision of my life.. today, I married my best friend. Hello there, husband! @angadbedi” అంటూ నేహా ఇన్‌స్టాగ్రమ్‌లో పెళ్లి ఫొటోలు పోస్టు చేసింది. ‘‘Best friend.. now wife!! Well Hello there mrs BEDI!!!’’ అంటూ అంగద్ తమ పెళ్లి విషయాన్ని ధ్రువీకరించాడు.

వీరి వివాహం సిక్కు సంప్రదాయంలో జరిగినట్లు గా తెలుస్తోంది. తెలుగులో రాజశేఖర్ సరసన ఒక సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘జూలీ’లో నటించి సంచలనం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *