శ్రీ రెడ్డి కి ఎయిడ్స్..?

కాస్టింగ్ కౌచ్ పేరుతో వార్తల్లో నిలిచిన నటి శ్రీ రెడ్డి…తాజాగా తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతూ కొంత మంది నీచంగా వ్యవహరిస్తున్నారని , వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.

ఈ పిర్యాదు లో శ్రీ రెడ్డి కొంతమంది తనకు ఎయిడ్స్ ఉందని , ఎయిడ్స్‌తో చనిపోయిదంటూ యూట్యూబ్‌లో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసారని, నా ఫొటోలను అసభ్యకర రీతిలో పోస్టు చేస్తున్నారు’ అని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే వారి లింకులు తో పాటు యూట్యూబ్ వీడియో లింక్స్ కూడా తెలిపింది.

‘ఒక్కొక్కడి తాట వలుస్తా జాగ్రత్త. సైబర్ క్రైమ్‌లో కేసులు ఫైల్ చేశా. ఆడపిల్లలంటే మీ ఇష్టారాజ్యానికి ఏమైనా తిట్టొచ్చు అనుకునేవారికి చెల్లు చీటి. ఇప్పటికి 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇకపై పెద్ద తలకాయల పని చెప్తా..’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ అకౌంట్లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *