జక్కన్న – సమంతలకు ట్విట్టర్ షాక్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు – ఫేక్ ఎకౌంట్ల బెడద ఎక్కువైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేక్ అకౌంట్ల భరతం పట్టేందుకు ట్విట్టర్ నడుం బిగించింది. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచం నలుమూలలా ఉన్న పాపులర్ పొలిటీషియన్స్ నుంచి టాప్ హీరోల వరకు చాలామంది సెలబ్రిటీల ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో తగ్గుతోంది. ట్విట్టర్ తీసుకున్న చర్యతో పాపులర్ సింగర్ కేటీ పెర్రీ 28 లక్షలమంది ఫాలోవర్లను కోల్పోగా…పాప్ సింగర్ జస్టిన్ బీబర్ 26లక్షలమందిని కోల్పోయారు. భారత ప్రధాని మోదీకి 2.7 లక్షల మంది ఫాలోవర్లు తగ్గారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కు 4.2లక్షల మంది ఫాలోవర్లు తగ్గడం విశేషం.

టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు జక్కన్న – అక్కినేని నాగార్జున – రామ్ గోపాల్ వర్మ – అక్కినేని సమంత ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ తాజా నిర్ణయంతో….నాగార్జునకు 34 వేల మంది ఫాలోవర్లు తగ్గగా…ఆయన కోడలు సమంతకు 32 వేల మంది తగ్గారు. రాజమౌళికి 33 వేల మంది తగ్గగా….జూనియర్ ఎన్టీఆర్ కు 16 వేల మంది తగ్గారు. అయితే హఠాత్తుగా ఇంతమంది ఫాలోవర్లు తగ్గడం….బాధగానే ఉంటుందని కానీ ట్టిట్టర్ ను మరింత పారదర్శకంగా చేయడం కోసం ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పవని ట్విట్టర్ సంస్థ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *